పెంపుడు జంతువులకు ఉచిత రాబిస్ వ్యాధి టీకా - డాక్టర్ రూప కుమార్

పెంపుడు జంతువులకు ఉచిత రాబిస్ వ్యాధి టీకా - డాక్టర్ రూప కుమార్

హుజూర్ నగర్ ,టౌన్ ,ముద్ర:ప్రపంచ పశు సంక్రమిక వ్యాధుల దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని పశువైద్యశాలలో డాక్టర్ రూప కుమార్ ఆధ్వర్యంలో 72 పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ వ్యాధి నివారణ టీకా వేయడం జరిగింది.  కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు కౌన్సిలర్ గాయత్రి భాస్కర్, మండలపశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,పశువైద్య సిబ్బంది, పెంపుడు కుక్కల యజమానులు పాల్గొన్నారు.