డీడీలు కట్టిన గొర్రెల కాపరులకు రాష్ట్ర ప్రభుత్వం  వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలి....

డీడీలు కట్టిన గొర్రెల కాపరులకు రాష్ట్ర ప్రభుత్వం  వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలి....
  • బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనంజయ నాయుడు

ముద్ర, అనంతగిరి:రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ పథకంలో యాదవులు డీడీలు తీసి 4 నెలలు దాటినా గొర్రెలను పంపిణీ చేయకపోవడం దారుణం అన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ సమీపస్తునడం తో  గొర్రెల పంపిణీ జరగకపోవచ్చు అన్న ఆందోళనలో యాదవులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే గొర్రెల పంపిణీ పథకం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.  యాదవులు గొర్రెల కొనుగోలు కోసం పరాయి రాష్ట్రాల్లో 10 నుంచి 15 రోజులపాటు  పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన గొర్రెలు దొరక్క ఇక్కడ వాతావరణానికి గొర్రెలు ఇమడక గొర్రెలు మృతి చెంది తీవ్రంగా నష్టపోతున్నారని  గొర్ల కాపర్లు చెబుతున్న మాటలు పరిశీలించాలని కోరారు. గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ తో నేరుగా గొర్రెల కాపరుల  లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ  చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకాన్ని గ్రామాల్లో అమలు చేసినట్టుగానే మున్సిపాలిటీలో జీవిస్తున్న గొల్ల కురుమలకుకూడ వర్తింపజేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క గొల్ల కురుమల బిడ్డకు సభ్యత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఇనుగుర్తి వెంకటరమణ చారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బచ్చు రాజ్యం, జిల్లా ఉపాధ్యక్షులు నిగిడాల వీరయ్య.  బొడ్డుపల్లి సుందరయ్య. మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు మండవ నాగమణి.దొంగరి కృష్ణ. తదితరులు ఉన్నారు.