గీత కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలి.....

గీత కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలి.....
  • మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి... 

ఆలేరు (ముద్ర న్యూస్):గీత కార్మికులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు పిలుపునిచ్చారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అక్టోబర్ మాసంలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జరిగిన తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలకు గీత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై భారీ బహిరంగ సభ జరగడంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గౌడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు. గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవాడాన్ని నిరసిస్తూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జూలై 10న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమంలో చెప్పారు.

సభ్యత్వం ఉన్న ప్రతి గీత కార్మికునికి ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసి. రాష్ట్ర టాడి కార్పొరేషన్ కు నిధులు కేటాయించి రాష్ట్రంలోని ప్రతి గీత కార్మికునికి ఉచితంగా భద్రతతో కూడిన మోకులను అందించాలని డిమాండ్ చేశారు. బిసి కులవృత్తులకు ప్రభుత్వం ఇస్తామన్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని గౌడ కులస్తులకు. కల్లుగీత కార్మికులకు వర్తింప చేయాలని కోరారు. గీత కార్మికుల సహజ మరణాలకు ఐదు లక్షల రూపాయలు వర్తించే విధంగా గీతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. గుత్తిలో ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి కిందపడి మరణించిన. గాయాల పాలైన గీతా కార్మికులకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియాన్ ప్రతి లక్షల రూపాయలకు పెంచి. కోర్టు నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సొసైటీలకు ఐదు ఎకరాల భూమిని కేటాయించి. కల్లుకు మార్కెట్.  తాటి. ఈత మార్కెట్ అవకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రభుత్వం ఐదువేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని సూచించారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి దించాలని అన్నారు. జూలై 10న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ఆందోళన కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన గీత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నేమిలే మహేందర్ గౌడ్. భత్తిని బిక్షం. జిల్లా ఉపాధ్యక్షులు మొరిగాడి రమేష్. కోరుకొప్పుల కిష్టయ్య. జిల్లా నాయకులు కోల వెంకటేష్. పాండవుల లక్ష్మణ్. భత్తిని సత్యనారాయణ. నేమిలే రాజయ్య. లొడి మల్లయ్య. ఘనగాని మల్లేష్. మొరిగాడి అశోక్. మొరిగాడి అంజయ్య. దూడల రోశయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.