ఉత్సవాల ఏర్పాట్లఫై  భక్తుల అసహనం

ఉత్సవాల ఏర్పాట్లఫై  భక్తుల అసహనం

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు  అసహనం వ్యక్తం చేశారు. కోనేరులో కేవలం పాదాలు మాత్రమే మునిగే వరకు నీళ్లు నింపడంతో పాటు, షవర్లు కొన్ని పనిచేయడం లేదని పలువురు దీక్ష పరులు ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా, స్వామి వారి దర్శనంకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేసే చందనం బొట్టు ఆలయం వెనుకాల, మెట్లపై కింద పెట్టడం పట్ల భక్తుల మనోబావాలు దేబ్బతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . దాంతో మెట్లపై నుంచి వెళ్లే భక్తులు రెండు ప్లేట్స్ లో ఉన్న చందనం బొట్టు కాళ్ళకు అంటకుండా... ఇబ్బంది పడుతూ నడిచారు. కాగా, ఆలయ అధికారులు డ్రెస్ కోడ్ పాటించాలని పలువురు కోరారు.