మనసున్న మంచి మనిషి ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ

మనసున్న మంచి మనిషి ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ
  • సన్మాన సభలో ముత్తారం గ్రామ ప్రజలు

ముద్ర, ముత్తారం:- మనసున్న మంచి వ్యక్తి ముత్తారం తాజా మాజీ సర్పంచ్ తూటీ రజిత రఫి అని ముత్తారం గ్రామస్తులు తెలిపారు.  ఐదు సంవత్సరాలుగా ముత్తారం గ్రామ సర్పంచ్ గా  గ్రామస్తులకు సేవలందించిన తూటి రజిత రఫీ దంపతులను ముత్తారం గ్రామం ప్రజలు ఘనంగా సన్మానించారు.  

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రతి కుటుంబానికి కష్టాం వస్తే నేనున్నా.. అంటూ ధైర్యాన్నిచ్చి అండగా ఉండాలని అటువంటి కొంతమంది వ్యక్తుల్లో తూటి రజిత రఫీ సర్పంచ్ అని, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి గ్రామంలో ఒక భూస్వామీ పై పోటీ చేసి అధిక మెజారిటీతో గెలిచి ఐదు సంవత్సరాలు గా గ్రామ ప్రజలలో ఉంటూ నిరంతరం ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు.  వీరి సేవలను రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ రజిత రఫీలు మాట్లాడుతూ ముత్తారం గ్రామ ప్రజల ఆశీర్వాదాల తోని తాను సర్పంచిగా గెలిచానని వారికి ఎంత సేవ చేసినా తక్కువేనని,  తమ జీవితాంతం ముత్తారం గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అంకితం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల బాలు, అనుము సమ్మయ్య, మల్యాల శంకర్, సిద్ధ శ్రీనివాస్, అనుము చిన్న రామస్వామి, మల్యాల పెద్దరాజయ్య, మల్యాల దేవేందర్, కుక్కల చంద్రమౌళి, జక్కుల రాజయ్య, మధురకవి రఘు, నారాయణస్వామి, మధురకవి శ్రీనివాస్, వుదరి కృష్ణ, అనుము గోపాలు, చల్ల సమ్మయ్య,  తూడ్డల రాజు పాల్గొన్నారు.