జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ పెద్దపల్లి పాలకమండలి ఎన్నికలు నిర్వహణ...

జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ పెద్దపల్లి పాలకమండలి ఎన్నికలు నిర్వహణ...
  • మార్చి 23న పాలకమండలి ఎన్నికలు నిర్వహణ
  • మార్చి 19న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల నామినేషన్లు స్వీకరణ
  • ఎన్నికల అధికారి బి.రామ్మోహన్ రావు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ (రి. నెం. పి -52) యొక్క పాలకమండలి ఎన్నికలను మార్చి 23న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి బి. రామ్మోహన్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ, హైదరాబాద్ సూచన మేరకు మార్చి 23 న రహస్య బ్యాలెట్ పద్ధతిన జిల్లా మత్స్య పారిశ్రామిక శాఖ సంఘం లిమిటెడ్ యొక్క పాలకమండలి ఎన్నికలను నిర్వహించుటకు తనను ఎన్నికల అధికారిగా నియమించినట్లు జిల్లా సహకార అధికారి కార్యాలయ డిప్యూటీ రిజిస్టర్,ఆడిట్ అధికారి బి.రామ్మోహన్ తెలిపారు.

మార్చి 23న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఈ ఎన్నికలో మొత్తం 11 జనరల్ క్యాటగిరి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపారు.పెద్దపల్లి కూనారం రోడ్డులోనీ నందన గార్డెన్ లో మార్చి 19న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల నామినేషన్లు స్వీకరణ ఉంటుందని, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు వెయ్యి రూపాయలు, వెనకబడిన తరగతుల వారు రెండు వేలు జనరల్ క్యాటగిరీ వాళ్ళు 4 వేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.  అదే రోజు మధ్యాహ్నం 1-30 నుండి 3-00 వరకు నామినేషన్లు పరిశీలించి అర్హమైన నామినేషన్ ల జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3-30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ లు ఉపసంహరణ చేసుకోవచ్చని, నామినేషన్లు ఉపసంహరణ అనంతరం అర్హమైన తుది జాబితా, ఎన్నికల చిహ్నాలు ప్రకటించ నున్నట్లు తెలిపారు.

మొత్తం స్థానాలకు మించి అర్హమైన నామినేషన్లు దాఖలు కానీ సందర్భంలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లు  మార్చి 19న ప్రకటించడం జరుగుతుందని, పోటీ ఉన్నప్పుడు మార్చి 23న నందన గార్డెన్ లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం 3 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేసి అదే రోజు ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని ఎన్నికల అధికారి బి. రామ్మోహన్ ఆ ప్రకటనలో తెలిపారు.