పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా...

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా...
  • రామగుండం పోలీస్ కమిషనరేట్ అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దు పోలీసు అధికారుల సమావేశంలో  సిపి శ్రీనివాసులు...


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషిచేయాలని,  మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని,  మహారాష్ట్ర, రామగుండం పోలీస్ కమిషనరేట్ మరియు సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు నిర్ణయించారు. శుక్రవారం జైపూర్ ఎస్ టి పిపి లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఆధ్వర్యంలో మహారాష్ట్ర, సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహాద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి,  ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని  పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని, ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో  నిర్వహించవచ్చని, సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరి సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమీషనర్ పోలీసు అధికారులను ఉద్దేశించి  మాట్లాడుతూ  త్వరలో జరుగబోయే  ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ల సరిహద్దులో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయటం తో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్ కు సంబందించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలతో పాటు, సరిహద్దు గుండా అక్రమ మద్యం, మహారాష్ట్ర దేశీదారు, గంజాయి మొదలైన వాటి రవాణా నియంత్రించడం మరియు ఎలా నియంత్రించాలి, నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని, అలాగే సరిహద్దు రాష్ట్రల, జిల్లాల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలన్నారు. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్ బి డబ్ల్యూ వారెంట్స్ ల విషయంలో రాష్ట్రాల పోలీసులు  ఒకరి ఒకరు సహకరించుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశం లో ఆన్ లైన్ జూమ్ మీటింగ్ ద్వారా కొందరు అధికారులు అటెండ్ కావడం అయ్యారు.ఈ సమావేశం లో రామగుండం సిపి ఎం. శ్రీనివాస్, గడ్చిరోలి ఎస్పీ. నీలోత్పాల్,  మహారాష్ట్ర,  అశోక్ కుమార్,  మంచిర్యాల, యతీష్ దేశ్‌ముఖ్,  గడ్చిరోలి(ఆపరేషన్స్), ఎం.  రమేష్, అదనపు ఎస్పీ అహేరి, వైభవ్ బ్యాంకర్, అదనపు ఎస్పీ బెజాపూర్ (ఆపరేషన్స్), ఎన్ భుజంగ రావు,అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) భూపాలపల్లి, ఆర్. ప్రభాకర్ రావు,అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.బి.  ఆసిఫాబాద్, చంద్రకాంత్ గవర్న, ఎస్పీ బెజాపూర్ (అడ్మిన్), జి. దయానంద్, ఓఎస్డీ గ్రేహౌండ్స్, సందేశ్ నాయక్, ఎస్డీపీఓ సిరోంచ, ఎ గంగా రెడ్డి, ఎస్డీపీఓ నిర్మల్, ఎ. కరుణాకర్, ఎస్డీపీఓ కాగజ్‌నగర్, రామగుండం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.