వాకర్ల తో అత్మీయ పలకరింపులు ఆలింగనాలు.. - విజయరమణా రావు

వాకర్ల తో అత్మీయ పలకరింపులు ఆలింగనాలు.. - విజయరమణా రావు

పెద్దపల్లి ఐటిఐ కళాశాల మైదానంలో  మార్నింగ్ వాకింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణా రావు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని ఐటిఐ ప్రభుత్వ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణ రావు  వాకర్ల తో మార్నింగ్ వాకింగ్ చేశారు. మైదానంలో ఆయన్ని చూసిన వాకర్లు అత్మీయంగా పలకరిస్తూ అలింగనం చేసుకున్నారు. అనంతరం యువకులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా పలువురు వాకార్ల తో మాట్లాడుతూ...పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేద్దామన్నారు.  పెద్దపల్లి నియోజకవర్గన్ని ఈ ఎమ్మెల్యే మొత్తం దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే భాద్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటు వేసి  ఆశీర్వదించగలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,వాకార్స్, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు.