ముత్తారంలో ప్రచార రథం అందించిన శ్రీధర్ బాబు అభిమాని తూల మనోహర్ రావు
జెండా ఊపి ప్రచార రథన్ని ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
ముద్ర ముత్తారం: కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలుపు కొరకు శ్రీధర్ బాబు వీర అభిమాణి పెద్దపల్లి నియోజకవర్గం కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రేస్ సీనియర్ నాయకులు తుల మనోహర్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు మీద అభిమానంతో ఈ రథాన్ని ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అందించారు. ఈ రథాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ లు జెండా ఊపి కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. మనోహర్ రావును వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కం ప్రభాకర్, ఎడవేన సంపత్, అనము గోపి, జక్కుల రమేష్, నాగేందర్ యాదవ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్, ముత్తారం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.