తూర్పు మావోల ఇలాఖా పలిమలలో మంత్రి శ్రీధర్ బాబు పల్లెనిద్ర

తూర్పు మావోల ఇలాఖా పలిమలలో మంత్రి శ్రీధర్ బాబు పల్లెనిద్ర
  • గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు


మహదేవపూర్, ముద్ర: మావోయిస్టు ఇలాఖా తూర్పు డివిజన్ లోని పలిమెల మండల కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు. రాత్రి 11:30 చేరుకున్న శ్రీధర్ బాబు రెండు గంటలపాటు ప్రజలతో అర్ధరాత్రి ముచ్చటించారు. అనంతరం ఒక కార్యకర్త ఇంటిలో నిద్రకు ఉపక్రమించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు కాటారంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, మహదేవపూర్ 10 గంటలకు భోజనం చేసి నేరుగా పలిమెల మండల కేంద్రానికి చేరుకున్న మంత్రి పలిమెలలో బసచేశారు.

రాత్రి గ్రామస్తులతో సమస్యలు అడిగి తెలుసుకొని గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు గ్రామ ప్రజలకు హామి ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీస్ లు భారీ బందోబస్తు నిర్వహించారు. మంగళవారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబు పలిమెల మండల ప్రజా ప్రతినిధులతో మాట్లాడి మండల అభివృద్ధికి కూడా అధిక నిధులుకేటాయించి తూర్పు డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నాలుగు అంగన్వాడీ కేంద్ర భవనాలకు రూ. 60 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ కాంప్లెక్స్ కు శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. వీరి వెంట ఎంపీపీ బుచ్చక్క, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నన్న, జడ్పిటిసి గుడాల అరుణ రామ్మోహన్ రావు, లతోపాటు పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.