ముత్తారం ఎంపీ ఓ వేణుమాధవ్ అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు - బొల్లంపల్లి సంతోష్ గౌడ్

ముత్తారం ఎంపీ ఓ వేణుమాధవ్ అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు -  బొల్లంపల్లి సంతోష్ గౌడ్

ముద్ర ముత్తారం: ముత్తారం పంచాయతీ అధికారి  (ఎంపీఓ) వేణుమాధవ్ పై త్వరలోనే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు కమ్మంపల్లికి చెందిన బొల్లంపల్లి సంతోష్ గౌడ్ తెలిపారు.ముత్తారం మండలంలో గత  నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వర్థిస్తున్న ఎంపిఓ వేణుమాధవ్ పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడుస్తూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని అన్నారు. మండలంలోని పలువురు పౌరులు గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాల మరియు సెక్రెటర్ల మీద కానీ ప్రభుత్వ స్థలాల అక్రమణ మీద పిర్యాదులు చేసిన పిర్యాదు దార్లకు తెల్వకుండా ఎంక్వయిరీ చేస్తూ అక్రమార్కుల వద్ద డబ్బులు దండుకొంటూ వారికి అండగా నిల్చి, లక్షాలాది రూపాయలు దోచుకొన్న అవినీతిపరుడని, మండలంలోని అన్ని గ్రామపంచాయతీ ఓకే విదంగా పంచాయతీ రాజ్ చట్టాన్ని వర్తింపచేయకుండా గ్రామానికో విధంగా నిబంధన పెట్టుకొని తనకు నచ్చిన సర్పంచ్ లకు నిధులు మరియు విధులు దుర్వినియోగం చేశాడని, మండలంలోని దర్యాపూర్  గ్రామపంచాయతీలో అనేక అవినీతి అక్రమాలు చేసిన, నిధుల గోల్ మాల్ చేసిన ఆ అక్రమార్కులకు వంతపాడి తూ తూ మంత్రంగా విచారణ జరిపి అక్రమార్కులను ఈ ఎంపీఓ కాపాడారన్నారు.

అవినీతి పరుడైన ఈ  ఎంపీఓ వేణుమాధవ్ పై జిల్లా కలెక్టర్ కు త్వరలోనే ఫిర్యాదు చేసి అతని అవినీతి అక్రమాలపై విచారణ జరిపితే, అతని అవినీతి బయటపడుతుందని, మండలంలో పారిశుద్యాన్ని ప్రజా సమస్యలను గాలికొదిలేసి నాయకులతో విందు వినోద్దాల్లో మునిగితేలుతూ అక్రమార్కుల మీద పిర్యాదు అందితె వారి వద్ద డబ్బులు గుంజుతూ మరో పక్క ఎంక్వయిరీ పేరుతో అవినీతిపరులను వద్ద డబ్బులు తీసుకొని వారికి మద్దతుగా రిపోర్ట్ ఇస్తున్నాడని, అంతేకాకుండ పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, లోకాయుక్త ఏసీబీ డిజికి పిర్యాదు చేయనున్నట్లు సంతోష్ గౌడ్ తెలిపారు.