ముద్ర దిన పత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్నది

ముద్ర దిన పత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్నది
  • ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి పత్రికలె...
  • పెద్దపల్లిలో "ముద్ర" దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో *రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:-ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పత్రికలు పనిచేస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో  కీలక పాత్ర పోషిస్తున్నాయని,  ముద్ర దిన పత్రిక అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ప్రశంసించారు.  పెద్దపల్లి జిల్లా ఎలిగెడు మండలంలో ఎమ్మెల్యే విజయ రామణారావు ఇంటి అవరణలో ఆదివారం ముద్ర దిన పత్రిక – 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి ఎమ్మెల్యేలు రాజ్ ఠాగూర్, లక్ష్మణ్ కుమార్, విజయ రామణారావు లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు.

నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు, పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలన మంత్రి అన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు. కానీ పత్రిక యాజమాన్యాలు కొన్ని పాత్రికేయులను తమకు అనుకూలంగానే వార్తలు రాయించుకునే పరిస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని అన్నారు. జర్నలిస్టులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వకుండా కొన్ని యాజమాన్యాలె నియంత పోకడలు పోవడం విచారకరమన్నారు. ముద్ర దినపత్రిక పక్షపాత ధోరణి లేకుండా సమన్యాయం పాటిస్తూ ప్రజలకు అత్యంత వేగంగా వార్తలు అందించడంలో పతాక శీర్షికన  నిలబడుతుందని మంత్రి అభినందించారు. ఈ  కార్యక్రమంలో ముద్ర దినపత్రిక జిల్లా స్టాప్ రిపోర్టర్ మల్లేష్ యాదవ్, నాయకులు  నాగినెని జగన్మోహన్ రావు, చొప్పరి సదానందం, తొట్ల తిరుపతి యాదవ్, వనం రాంచందర్ రావు. భస్కర్ రావు, తోట చంద్రన్న, తమ్మెనబొయిన ఓదేలు యాదవ్, యాదవ్,  పాత్రికేయులు పాలకుర్తి విజయ్ కుమార్, రవి యాదవ్, వైకుంఠం పాల్గొన్నారు.