మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు 

మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దు 

మత్తు మత్తు షార్ట్ ఫిల్మ్ ను ఆవిష్కరణలో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ 

జగిత్యాల పట్టణానికి చెందిన ప్రదీప్ డైరెక్షన్లో యువకులు మత్తు పదార్థాలు తీసుకోవడం, బానిస కావడం అనే కోణం లో మత్తు పదార్థాల పై అవగాహనకోసం రూపొందించిన మత్తు షార్ట్ ఫిలింను యూట్యూబ్ ద్వారా ఆదివారం ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ నేటి సమాజం లో యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, గంజాయి సేవించడం, విలాసాలకు అలవాటు పడి గంజాయి సప్లయ్ చేస్తూ పోలీసులకు దొరికి జీవితాన్ని చీకటి మయం చేసుకుంటున్నారని అన్నారు.

పిల్లల తల్లి దండ్రులు యువత చదువు మాత్రమే కాకుండా వారి ప్రవర్తన,అలవాట్ల పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు అనే షార్ట్ ఫిల్మ్ తీసిన యువత నేటి యువతకు ఆదర్శం.. యువకులను మత్తు నుండి కాపాడాలి అని వారు తీసిన ఫిల్మ్ అభినందనీయం అని యువకులను ఎమ్మెల్యే అభినందించారు. మద్యం, ధూమపానం, గంజాయి సేవించడం వల్ల నేడు రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించిన వారిలో యువత అత్యదికంగా ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, పట్టణ నూర్ బాషా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పట్టణ పార్టీ ఉప అధ్యక్షులు ధుమాల రాజ కుమార్, నాయకులు ఆడేపు సత్యం, పెండెం గంగాధర్, నటులు చైతన్య, ప్రభాస్, క్రాంతి, అసిఫ్, తదితరులు పాల్గొన్నారు.