పెద్దపల్లి లో నేర, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో "ఆపరేషన్ గరుడ" ప్రారంభం

పెద్దపల్లి లో నేర, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో "ఆపరేషన్ గరుడ" ప్రారంభం

డ్రోన్ లతో పట్టణం లో పెట్రోలింగ్ ముమ్మరం, రామగుండం సిపి శ్రీనివాసులు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి లో నేర, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ లు "ఆపరేషన్ గరుడ" ప్రారంభించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ... అసాంఘీక శక్తుల నిర్మూలనకు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్‌ గరుడ మొదలు పెట్టమని కమిషనర్‌ తెలియజేశారు. సిపి గా రామగుండంలో చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సందర్శనకు వచ్చినప్పుడు, సిబ్బంది వివిధ డ్యూటీ లో ఉండి కొన్ని సందర్బలలో ప్రత్యేక నిఘా ఉంచడం ఇబ్బందిగా ఉంటుందని తెలియడంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలిసింగ్ కి సహాయం పొందేవిధంగా డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేయాలనే ఉద్దేశ్యం తో "ఆపరేషన్ గరుడ" కార్యక్రమం ప్రారంభించామని అన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పట్టణం ను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం తక్కువ సమయం లో డ్రోన్ ద్వారా సాధ్యం అవుతుందని, ఎవరైనా గొడవలకు పాల్పడిన, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వీడియోలు, ఫోటోల ఆధారాలతో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఉండెదుకు "ఆపరేషన్‌ గరుడ" పేరిట డ్రోన్‌లతో పెట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేక నిఘా ఉంటుందని భవిష్యత్తు లో కమిషనరేట్‌ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ప్రజల భద్రత మరియు నేరాల నియంత్రణ లో భాగంగా పోలీస్ వారికీ తమ వంతు సహాయం గా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ చెగొండ వెంకటేష్ ఆపరేషన్ గరుడ కోసం ఉపయోగించే డ్రోన్ కోసం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు .వచ్చారని, వారిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, పెద్దపల్లి ఏసిపి కృష్ణ , సీఐ కృష్ణ,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్‌ఐ లు లక్ష్మణ్‌రావు, మల్లేష్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.