చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల ను అమలు చేయలేదు

చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల ను అమలు చేయలేదు

పెద్దపల్లి లో కాంగ్రెస్ పార్టీలో చేరిన 7 వ వార్డ్ కౌన్సిలర్ కనకలక్ష్మి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయ రమణారావు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన7 వ వార్డ్ కౌన్సిలర్ కోమిరిశెట్టి కనకలక్ష్మి - శ్రీకాంత్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కౌన్సిలర్ కనకలక్ష్మీ దంపతులకు విజయ రమణారావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.