10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు

10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు
  • రామగుండం సిపి ఎం. శ్రీనివాస్ లు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. ఐపిఎస్, (ఐజి) గురువారం పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. గోదావరిఖని లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, సేక్రెడ్ హార్ట్ హైస్కూల్ లోని పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షంచారు. పదవతరగతి పరీక్షలను పురస్కరించుకొని పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు, ఇన్విజిలెటర్లు దృష్టి పెట్టాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమిగూడవద్దని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే కేంద్రం లోపలికి అనుమతించాలని అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి సూచించారు. పదవతరగతి పరీక్షలు కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష సమయం కన్నా గంట ముందు పరీక్ష కేంద్రాల చుట్టూ పోలీస్ వారు తనిఖీ చేయడం జరుగుతుంది అన్నారు. ప్రశ్నపత్రాలు తీసుకు వెళ్ళడం ఎగ్జామ్ పూర్తయిన తర్వాత మరియు జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చే వరకు పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎవరు కూడా పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు ఎవరు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రాసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.