చించోలి ఘటనలో నలుగురిపై కేసు నమోదు
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి మైనార్టీ సంక్షేమ శాఖ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన లో నలుగురిపై కేసు నమోదు చేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఈ కేసుతో ప్రమేయం ఉన్న పదో తరగతి విద్యార్థి తో పాటు సంస్థ ప్రిన్సిపల్ మహేష్, సంఘటన సమయంలో ఇంఛార్జి గా ఉన్న రమేష్, అప్సిస్మ లపై కేసు నమోదు అయింది