శాంతి భద్రతల రక్షణ లో పోలీసుల బాధ్యత కీలకం - రాష్ట్ర మంత్రి అల్లోల

శాంతి భద్రతల రక్షణ లో పోలీసుల బాధ్యత కీలకం - రాష్ట్ర మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ లోను, ప్రజా సంక్షేమం లోను పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోలీసు సురక్ష దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసు వాహనాల ప్రదర్శన నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అల్లోల మాట్లాడుతూ ప్రజలకు రోజువారీ జీవితంలో ఇబ్బందులు రాకుండా వారి పరిరక్షణలో పోలీసు శాఖ నిరంతరం పని చేస్తోందన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మత పరమైన సమస్యలు తలెత్తేవని, రాష్ట్ర సాధన అనంతరం మతసామరస్యం పెంపొందేలా పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన అభినందించారు. పోలీసులు సమాజానికి రక్షణ కవచంగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగే రన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్, నిర్మల్ డీ ఎస్పీ జీవన్ రెడ్డి తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.