రామగుండంలో రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ 

రామగుండంలో రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ 
  • మళ్లీ ఎమ్మెల్యేగా తానే గెలవబోతున్నాను విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే  అభ్యర్థి కోరుకంటి చందర్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రామగుండం నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల నిర్విరామ కృషితో తిరిగి తానే ఎమ్మెల్యేగా గెలువబోతున్నానని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని  ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ, గడపగడపకూ తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారని, తన గెలుపే లక్ష్యంగా కృషి చేసారని కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం నియోజకవర్గం చైతన్యానికి మారుపేరని, ఉద్యమ కారులను కన్నగడ్డ అని, తనను అక్కున చేర్చుకున్న నేల అని, 2018లో తనకు ఎమ్మెల్యేగా సేవచేసే గొప్ప అదృష్టం, అవకాశమిచ్చిన ప్రజల కోసం రోజులో 18గంటలు, సంవత్సరంలో 350రోజులు వారి సౌకర్యాల కల్పనలోనే, వారి సేవలోనే గడిపానన్నారు.

 ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నో కుట్రలు చేసాడన్నారు. తాను ప్రజాప్రతినిధులకుగానీ, ప్రజలకుగానీ, ఓటు కోసం మద్యం, మాంసం పంచలేదని, ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు. ప్రజలు ధర్మం దిక్కు, న్యాయం వైపే ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్  పాలనలో తనతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన లబ్ధిదారులు, ప్రజలు స్పందించిన తీరు అమోఘమని కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో అంతర్గం జడ్పిటిసి ఆముల నారాయణ, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, ఎన్ వి రెడ్డి, బాదే అంజలి,  కో ఆప్షన్ మెంబర్ తస్నీమ్ భాను, పిటి స్వామి, కౌశిక హరి, గోపు ఐలయ్య యాదవ్, పర్లపల్లి రవి, మెతుకు దేవరాజ్, జేవిరాజు, కాల్వ శ్రీనివాస్, నూతి తిరుపతి, నారాయణ, దాసరి ఎల్లయ్య, దాసరి శ్రీనివాస్, మేకల సమ్మయ్య, గాదం నందు, బండరాజు,  కొర్రి ఓదెలు, చింటూ, సంధ్యారెడ్డి, స్వాతి, కళావతి, రమ్య యాదవ్, సమ్మెట సప్న, నాగమణి తదితరులు పాల్గొన్నారు.