40 కోట్ల 33 లక్షల విలువ గల 431 ఉపాధి హామీ పనులు మంజూరు..

40 కోట్ల 33 లక్షల విలువ గల 431 ఉపాధి హామీ పనులు మంజూరు..
  • ఈఈ పంచాయతీ రాజ్ గిరిష్ బాబు 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:-జిల్లాలో 40 కోట్ల 33 లక్షల విలువ గల 431 జాతీయ ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారని ఈఈ పంచాయతీ రాజ్ గిరిష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు వేసేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 40 కోట్ల 33 లక్షల అంచనా వ్యయంతో 431 సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారని తెలిపారు. 

మంథని మండలంలో 8 కోట్ల 17 లక్షల విలువ గల 88 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, కమాన్ పూర్ మండలంలో 2 కోట్ల 1 లక్ష విలువ గల 30 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రామగిరి మండలంలో  4 కోట్ల 98 లక్షల విలువ గల 51 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మంథని ముత్తారం మండలంలో 6 కోట్ల 55 లక్షల విలువ గల 65 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, అంతర్గాం మండలంలో 2 కోట్ల 63 లక్షల విలువ గల 12 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, పాలకుర్తి మండలంలో 3 కోట్ల 79 లక్షల విలువ గల 24 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ధర్మారం మండలంలో 2 కోట్ల 60 లక్షల విలువ గల 24 సీసీ రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేసినట్లు తెలిపారు.

పెద్దపల్లి మండలంలో 2 కోట్ల 25 లక్షల విలువ గల 31 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, జూలపల్లి మండలంలో 95 లక్షల విలువ గల 16 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సుల్తానాబాద్ మండలంలో కోటి 85 లక్షల విలువ గల 29 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఓదెల మండలంలో కోటి 85 లక్షల విలువ గల 21 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, శ్రీరాంపూర్ మండలంలో కోటి 50 లక్షల విలువ గల 24 సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఎలిగేడు మండలంలో కోటి 20 లక్షల విలువ గల 16 సీసీ రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేసినట్లు ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.