ఉమ్మడి మహబూబ్ నగర్ సమస్యలు గత పాలకుల నిర్లక్ష్యమే 

ఉమ్మడి మహబూబ్ నగర్ సమస్యలు గత పాలకుల నిర్లక్ష్యమే 
  • ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సిడబ్ల్యుసి కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్ రెడ్డి
  • షాద్ నగర్ నియోజక వర్గంలో కొనసాగుతున్న న్యాయ యాత్ర

ముద్ర, షాద్ నగర్: టిఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ మన శ్రీనివాస్ రెడ్డి మొక్కుబడిగా మారడంతో కేంద్రం లో సమస్యలు ఎక్కడివి అక్కడనే పెండింగ్లో ఉన్నాయని సిడబ్ల్యుసి సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, గత పాలకుల నిర్లక్ష్యానికి ఇవి సజీవ సాక్ష్యాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సిడబ్ల్యుసి కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం కొందుర్గ్ మండలం చెరుకుపల్లి,ఆగిరాల,వెంకిర్యాల, తంగిడిపల్లి, కొందర్గులలో యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను గత పదేండ్లు అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి పాలమూరు న్యాయ యాత్ర పేరుతో సీడబ్ల్యూస్ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి యాత్ర షాద్ నగర్ లో రెండవ రోజు కొనసాగింది.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ పదేండ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీటి వసతులు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోని మండలాలలో పర్యటించి సమస్యలను గుర్తించేందుకు యాత్ర చేపట్టామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ, మండల కేంద్రాలలోనూ వస్తున్న ఆదరణ తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని పెర్కొన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించామని తెలిపారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించి సాగునీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణానది చెంతన ఉండి.. నీటి వనరులను సులభంగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం 160 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నీళ్లను తెస్తామని గొప్పలు చెప్పిందని వివరించారు. ఈ యాత్రలో మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి జితేందర్ రెడ్డి ,ఇబ్రహీం,పురుషోత్తం రెడ్డి, తిరుపతిరెడ్డి, రాయకండి కృష్ణారెడ్డి, రఘునాయక్, చిలకమర్రి శీను తదితరులు పాల్గొన్నారు