చందుపట్లక... చల్లాక?

చందుపట్లక... చల్లాక?
  • మంథని బిజెపి టికెట్ ఎవరికో...?
  • మంథని బిజెపి పార్టీలో  కొనసాగుతున్న ఉత్కంఠ ఎమ్మెల్యే టికెట్ హామీతోనే బిజెపిలో చేరిన నారాయణరెడ్డి 
  • టికెట్ తనకే నని బిజెపి అధిష్టానం పై నమ్మకంతో సునీల్ రెడ్డి 
  • మంథనిలో అయోమయంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని  బిజెపి ఎమ్మెల్యే టికెట్ చందుపట్ల కా... లేక ఆదివారం బిజెపి పార్టీలో చేరిన చల్ల కా ...అనే ఉత్కంఠ మంథని బిజెపి పార్టీలో పార్టీలో నేలకొంది...ఇప్పటికే బిజెపి ఎమ్మెల్యే టికెట్ తనదేనని ఎంతో ఆశతో సునీల్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ప్రచారం చేసుకుంటున్నా, సునీల్ రెడ్డికి బిజెపి అధిష్టానం చల్ల రూపంలో బారీ షాక్ ఇచ్చింది.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏకంగా  బిజెపి టికెట్ వస్తుందా రాదా అని సందిగ్ధం ఇప్పుడు బిజెపి పార్టీలో కొనసాగుతుండడంతో మంథని లో బిజెపి కార్యకర్తలు నాయకులు అయోమయంలో పడిపోయారు. 2011లో బిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నియోజకవర్గంలో పార్టీని విస్తరించి తీరా ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో నిరాశకు గురైన సునీల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

ఆ తరువాత జాతీయ పార్టీ బిజెపిలో చేరి మంథనిలో బిజెపి పార్టీని బలోపేతం చేసి ఎమ్మెల్యే పోటీ చేద్దామని సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ చల్లా నారాయణరెడ్డి బిజెపి అధిష్టానంతో చర్చలు జరిపి మంథని ఎమ్మెల్యే టికెట్ తనకు ఇస్తేనే బిజెపి పార్టీలో చేరుతానని అధిష్టానాన్ని కోరగా బిజెపి అధిష్టానం అందుకు అంగీకరించి నారాయణరెడ్డికి మంథని బిజెపి టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే ఆయనే బిజెపి పార్టీలో చేరినట్టు తెలుస్తోంది.  తనకే బిజెపి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని బిజెపి పార్టీ కోసం తాను ఎంతో కృషి చేశానని మందని నియోజకవర్గంలో బిజెపిని బలోపేతం చేసిన తనకి బిజెపి టికేట్ ఇస్తుందని సునీల్ రెడ్డి ఎంతో ఆశతో ఉన్నారు. 

ఇటు నారాయణరెడ్డి,  అటు సునీల్ రెడ్డి ఎవరికి వారే నాకే బిజెపి ఎమ్మెల్యే టికెట్  వస్తుందని ప్రచారం చేసుకుంటున్నా తరుణంలో బిజెపిలో ఉన్న క్యాడర్ అయోమయంలో పడ్డారు. ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి మద్దతు తెలిపాలో తెలియక తి నాయకులు తికమక పడుతున్నారు 

పాపం సునీల్ రెడ్డి భవిష్యత్తు ఏంది

మంథనిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది... తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ చివరకు సునీల్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అప్పుడే బిఆర్ఎస్ పార్టీలో చేరిన పుట్ట మధుకు టికెట్ ఇచ్చి సుసునీల్ రెడ్డికి షాక్ ఇచ్చింది...
 ఇప్పుడు బిజెపి పార్టీ కూడా చివరి నిమిషంలో సునీల్ రెడ్డికి కాదని కొత్తగా వచ్చిన నారాయణ రెడ్డికి టికెట్ ఇస్తుందా...
 లేదా చూడాలి.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాడా

 టికెట్ రాకుంటే సునీల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది. సునీల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పై నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.