శభాష్... నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడారు!

Jmmu & Kashmir: జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ సమీపంలోని జీలమ్ నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఇద్దరు స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు. నదిలో ఏడేళ్ల బాలుడు కొట్టుకుపోతుండటాన్ని జహూర్ అహ్మద్, షౌకత్ అహ్మద్ గుర్తించారు. వెంటనే నదిలోకి దిగి బాలుడిని ఒడ్డుకు చేర్చారు. సీపీఆర్ చేసి చిన్నారిని బతికించి, ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో వైరల్ కాగా బాలుడిని కాపాడిన ఆ ఇద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.