ఎన్నికల కమిషన్ నేషనల్ ఐకాన్ గా న్యూటన్ నటుడు రాజ్ కుమార్ రావు

ఎన్నికల కమిషన్ నేషనల్ ఐకాన్ గా న్యూటన్ నటుడు రాజ్ కుమార్ రావు

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించిన సమర్థమైన అధికారిగా న్యూటన్ చిత్రంలో పాత్రపోషించిన బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును భారత ఎన్నికల సంఘం గురువారం జాతీయ చిహ్నం (నేషనల్ ఐకాన్)గా గుర్తించింది. చాలామంది యువత, విద్యావంతులు, పట్టణవాసులు ఎంతోమంది ఉదాసీనతకులోనై తమ ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ ల వద్దకు రావడం కంటే సెలవు రోజుగా ఇంటివద్దే ఉండటానికి ఇష్టపడుతున్నారు. వారంతా పోలింగ్ లో పాల్గొనేలా ప్రేరేపించడానికి ప్రముఖ వ్యక్తులను ఎన్నికల సంఘం జాతీయ చిహ్నాలుగా నియమిస్తోంది.

 అందులో భాగంగానే రాజ్ కుమార్ రావును ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ లతో కూడా పోల్ ప్యానెల్ ఈసీ ఐకాన్ గా నియమిస్తూ ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఒక భద్రతా అధికారి యొక్క ఉదాసీనతని అధిగమించి స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని నిశ్చయించుకున్న ప్రభుత్వ గుమాస్తాగా రాజ్ కుమార్ రావు నటన న్యూటన్ చిత్రంలో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. 90వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారతదేశానికి నామినీగా కూడా నిలిచింది.ఇంతకుముందు, నటులు పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని మరియు MC మేరీకోమ్ వంటి వారిని ఈసీ జాతీయ చిహ్నాలుగా గుర్తించింది.