డా. పిడమర్తి రవి కి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ టికెట్ కేటాయించాలి

డా. పిడమర్తి రవి కి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ టికెట్ కేటాయించాలి
  • మాదిగలకు  ఈసారి కూడా ద్రోహం తల పెడితే ఊరుకునేది  లేదు
  • మాదిగ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వాసంపల్లి ఆనంద్ బాబు

 ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:  ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవికి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని, ఈసారి జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని మొదటి నుండి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా మళ్లీ ద్రోహం తలపెడుతోందని  మాదిగ జేఏసీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు తెలిపారు. శనివారం నాడు గోదావరిఖని లోని  ఆయన నివాసంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.  జే ఏ సి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అక్కపాక సంపత్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేస్తుందని,  రాష్ట్రంలో ఎస్సి లో మాదిగలు 80 లక్షలు ఉండగా, మాలలు 15 లక్షలు మాత్రమే ఉన్నారని అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాదిగలకు, మాదిగ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని మాదిగలు నమ్మి కాంగ్రెస్ గెలుపుకు కరణమైనారని, కానీ ఈసారి జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు స్తానం కలిపించకపోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం మాదిగలపై ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం లో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమ నాయకుడు డా. పిడమర్తి రవి కి తగిన గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మాదిగలకు జనాభా ప్రతిపతికన రెండు పార్లమెంట్ టికెట్స్ కేటాయిస్తూ హైదరాబాద్ లోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఉద్యమ నయకులు డా. పిడమర్తి రవికి కేటాయించి మాదిగల కు తగిన ప్రాధ్యాన్యత కల్పించే పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిదంగా పెద్దపల్లి పార్లమెంట్ విషయంలో కాంగ్రెస్ పునరాలోచన చేసి మాదిగకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.లేనిచో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్వయంలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తూ పునరాలోచన  లేని యెడల కాంగ్రెస్ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి శ్రీనివాస్, సుందిళ్ళ సంతోష్, చిలుముల సంతోష్, నర్సింగ్, ధర్మయ్య, రాజయ్య, కుమార్, మహేందర్, రాంబాబు, నాయకులు పాల్గొన్నారు.