సుడిగండంలో సునీల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు

సుడిగండంలో సునీల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు
  • నాడు బీఆర్ఎస్ పార్టీలో దక్కని ఎమ్మెల్యే టికెట్ 
  • నేడు బీజేపీ పార్టీలో అదే పరిస్థితి  ఎదురుకానుందా...
  • సునీల్ రెడ్డిని వాడుకొని...దూరం కొడుతున్న ప్రధాన పార్టీలు ...
  • అయోమయంలో సునీల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే  చందుపట్ల రాంరెడ్డి కుమారుడిగా రాజకీయ వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి వచ్చిన బిజెపి నాయకుడు చందుపట్ల సునీల్ రెడ్డి రాజకీయ పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో 2011 లో టీఆర్ఎస్ పార్టీ లు చేరి... 2014 వరకు  తెలంగాణ ఉద్యమంలో కీలక పోషించి ఉద్యమ  టిఆర్ఎస్ పార్టీని గ్రామ గ్రామాన మంథని నియోజక వర్గంలో విస్తృతం చేశారు. తీర ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఉహించకుండ మంథని ఎమ్మెల్యే టికెట్ సునీల్ రెడ్డికి కాకుండా పుట్ట మధుకు ఇవ్వడంతో తీవ్ర నిరాశకు గురైన సునీల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలో సమక్షంలో మంథని లో బహిరంగా సభ పెట్టి పేద్ద ఎత్తున  చేరారు. బిజెపి పార్టీ ని  నియోజకవర్గంలో గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి పాదయాత్రలతో పార్టీని ప్రతిష్ట పరిచారు. కానీ ఎన్నికల సమయంలో బిజెపి అధిష్టానం సునీల్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఊరిస్తుంది.  

టికెట్ కోసం సునీల్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేసుకునే పరిస్థితి దాపురించింది. సునీల్ రెడ్డి వెంబడి ఉన్న ఆయన క్యాడర్ అసంపూర్తితో ఇప్పుడు బీజేపీ పార్టీ పై రగిలిపోతున్నారు. సునీల్ రెడ్డి నే ఇలా ప్రధాన పార్టీలు వాడుకొని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా సునీల్ రెడ్డి కి వెన్నుపోటు పొడుస్తున్నాయని సునీల్ రెడ్డి వర్గం ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసంపూర్తి నేత చల్ల నారాయణరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి టికెట్ దక్కకపోవడంతో   స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సమయత్తమవున్న  సమయంలో ఆయన బిజెపి వైపు ఒక అడుగు వేసి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. బిజెపి అధిష్టానం కూడా సునీల్ రెడ్డిని కాదని చల్ల నారాయణరెడ్డి వైపే చూస్తుండడంతో బిజెపి మంథని ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర సస్పెన్షన్ కొనసాగుతుంది. టికెట్ రేపు మాపు అంటూ సునీల్ రెడ్డిని ఊరిస్తున్న బీజేపీ  అధిష్టానం  ఇటు చల్ల నారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయనకే మంథని ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా లేక పార్టీ కోసం పనిచేసిన సునీల్ రెడ్డి ని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా వేచి చూడాలి ఇప్పుడైతే చాల్ల నారాయణరెడ్డి మంథని బిజెపి ఎమ్మెల్యే టికెట్ నారాయణరెడ్డి ప  తనకే వస్తుందని  ప్రచారం చేసుకుంటున్నారు.  నారాయణరెడ్డి బిజెపిలో చేరేందుకు పెద్ద ఎత్తున కాన్వాయ్తో హైదరాబాద్కు పోయినట్టు తెలిసింది.

బిజెపి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో అని మంథని నియోజక వర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎది ఏమైనాప్పటికీ సునీల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆయన రాజకీయం ప్రశ్నార్థకంగా మారనుంది.  ఎన్నికల్లో బిజెపి అధిష్టానం   సునీల్ రెడ్డిని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్ప ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు  ప్రశ్నార్ధకేమినని మంథని ప్రజలు చర్చించుకుంటున్నారు. బిజెపి అధిష్టానం సునీల్ రెడ్డి సుడిగుండంలో నుండి తప్పిస్తుందా...లేక  సుడిగుండంలోనే నెట్టుతుందా... బీజేపీ అధిష్టానం పైనే సునీల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.