ఓడెడు లో ఘనంగా శ్రీపాద రావు జయంతి వేడుకలు 

ఓడెడు లో ఘనంగా శ్రీపాద రావు జయంతి వేడుకలు 

ముద్ర ముత్తారం:  మండలంలోని ఓడేడు గ్రామంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను తాజా మాజీ సర్పంచ్ సిరికొండ బక్కరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీపాదరావు చెదరని ముద్ర వేసుకున్నాడని, ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం శుభసూచకం అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ దేవనూరు భాను కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి చంద్రమౌళి గౌడ్, నాయకులు  తీగల సత్యనారాయణరావు,  గౌరీశెట్టి సత్యనారాయణ, నరెడ్ల సదానందం, హమాలి సంఘం ప్రెసిడెంట్ మారేడుగొండ సమ్మయ్య యాదవ్, మైనారిటీ నాయకుడు మహమ్మద్ హుస్సేన్ తదితరు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.