అక్రమ ఇసుక రవాణా నివారణకు అనుమతి తీసుకొని నడిచే ఇసుక ట్రాక్టర్ల పై పర్యవేక్షణ

అక్రమ ఇసుక రవాణా నివారణకు అనుమతి తీసుకొని నడిచే ఇసుక ట్రాక్టర్ల పై పర్యవేక్షణ


గుండాల మార్చ్ 23 (ముద్ర న్యూస్): గుండాల మండలంలో అక్రమ ఇసుక రవాణా నివారణకు అనుమతి తీసుకొని నడిచే ఇసుక ట్రాక్టర్ల పై పర్యవేక్షణపై తాసిల్దార్ కార్యాలయం రెవెన్యూ పోలీస్ శాఖ గ్రామపంచాయతీ కార్యదర్శులు మండల స్పెషల్ ఆఫీసర్లతో తాసిల్దారు జాలజ కుమారి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మండలంలో ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగిన సంబంధిత పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా వారి వివరాలు సేకరించి రెవెన్యూ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని అనుమాతులతో,నడిచే బండ్లపై నిఘా ఉంచాలని తాసిల్దార్ జాలజ కుమారి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో,రెవిన్యూ అధికారులు పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్  పాల్గొన్నారు