గ్రూప్-2 పరీక్ష వాయిదా వెయ్యాలి

గ్రూప్-2 పరీక్ష వాయిదా వెయ్యాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి : గ్రూప్-2 పరీక్ష వాయిదా వెయ్యాలని అభ్యర్దులు డిమాండ్ చేశారు. గురువారం  భువనగిరి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో నిరసన తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక్కో పరీక్ష సిలబస్ వేరు ఉండడం, పరీక్షల మధ్య గడువు చాలా తక్కువ ఉండడం వలన అభ్యర్దులు ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు. దీనిని గమనించి టీఎస్పీఎస్సీ,  ప్రభుత్వం స్పందించి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసి అభ్యర్ధులందరికీ న్యాయం చేయాలన్నారు.