కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణ రావు

కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణ రావు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: ఎలిగేడు మండలంలోని తన స్వంత గ్రామం అయినా శివపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  అభ్యర్థి  చింతకుంట విజయరమణా రావు  కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు.