సుల్తాన్ బాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

సుల్తాన్ బాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

ముద్ర ప్రతినిధి, పెద్ద‌ప‌ల్లి:- బీఆర్ఎస్ పార్టీకి పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో గట్టి షాక్ తగులుతుంది. రోజుకో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి.ఈ బాటలోనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపలిటీ నడిచింది. మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం శనివారం నెగ్గింది. మొత్తం15 మంది కౌన్సిలర్లలో చైర్ పర్సన్ ముత్యం సునీత పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 12 మంది కౌన్సిలర్లు ఓటేశారు.ఓటు వేసిన వారిలో 5 మంది కాంగ్రెస్, 7 గురు బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు.వాస్త‌వానికి 15 మంది కౌన్సిలర్లలో 5 గురు కాంగ్రెస్, 9 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉండ‌గా ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసి చైర్మ‌న్ ను గ‌ద్దెదింపారు.