అలసి సొలసి... సొమ్మసిల్లి పడిపోయి...

అలసి సొలసి... సొమ్మసిల్లి పడిపోయి...
  • ఖని చౌరస్తాలో న్యాయం కోసం మౌన పోరాటం కు దిగిన మహిళ హోంగార్డుకు అస్వస్థత
  • గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలింపు 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:- తొలగించిన ఉద్యోగం తిరిగి ఇవ్వాలని  న్యాయం కోసం రోడ్డు ఎక్కిన మహిళా హోంగార్డు దీక్షకు భగ్నం వాటిల్లింది. మూడు రోజులుగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శాంతియుతంగా మౌన దీక్ష చేస్తున్న మహిళా హోంగార్డు పద్మ సోమవారం నాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా అలసి సొలసి సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు హోంగార్డులు పద్మను హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇది ఇలా ఉండగా బాధితురాలిని హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించడానికి కారణాలు ఏమిటి? అనేది పోలీసు అధికారులు వెల్లడించడం లేదు. శనివారం నుంచి గోదావరిఖని నగరం నడిబొడ్డున దీక్ష చేస్తున్న పద్మకు న్యాయం జరగక ముందే ఆస్పత్రి పాలు కావడం  మిస్టరీగానే మిగిలిపోయింది.