Telangana Intermediate Hall Tickets - తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల...

Telangana Intermediate Hall Tickets - తెలంగాణ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల...

ముద్ర,హైదరాబాద్ : తెలంగాణలో నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల అవుతున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. tsbie.cgg.gov.in లోకి వెళ్లి మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈఎస్ఎస్ఎస్ సి లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తో థియరీ పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ లేదా సెకండియర్ హాల్ టికెట్ నెంబర్ తో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్లో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే.. ఉదాహరణకు ఫోటో తప్పుగా పడడం…సంతకాలు, ఇతర వివరాలు ఏవైనా తప్పుగా పడినట్లయితే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళి.. సరిదిద్దుకునే అవకాశం ఉంది.