మంథని - ముత్తారం రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు రాకపోకలకు తీవ్ర అంతరాయం

మంథని - ముత్తారం రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు రాకపోకలకు తీవ్ర అంతరాయం

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  మంథని - ముత్తారం ప్రధాన రహదారి గుమ్మనూరు సమీపంలో ప్రధాన రహదారికి అడ్డంగా ఉన్న చెట్టు విరిగి రోడు పడిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు,  వాహనదారులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. రోడ్డు పక్కన గల చెట్టుకు నిప్పు అంటుకొని విరిగిపడిపోయినట్లు తెలుస్తున్నది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్ అండ్ బి అధికారులు, స్థానిక పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే చెట్టును తొలగించి, రాకపోకలకు అంతరాయం జరగకుండా చూడాలని ముత్తారం - మంథని మండల ప్రజలు కోరుతున్నారు.