ముత్తారం-పారుపల్లి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్...

ముత్తారం-పారుపల్లి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్...
  • ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమం...

ముద్ర ముత్తారం:- ముత్తారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పాత ఐకెపి సమీపాన ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొనగా ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో ర ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  స్థానికుల కథనం ప్రకారం ముత్తారం నుంచి ద్విచక్ర వాహనంపై ముగ్గురు పారుపల్లి కి పోతుండగా పారుపల్లి నుంచి ముత్తారం వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనగా పారుపల్లికి చెందిన ఇనుముల సురేష్, భూషణ వేన రాజు, సంగె రమేష్ లకు గాయాలు కాగా రాజు. సురేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే  గ్రామస్తులు గాయాల పాలైన వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.