మున్నూరు కాపు సంఘం  పెద్దపల్లి  జిల్లా కన్వీనర్ గా ఇనుముల సతీష్..

మున్నూరు కాపు సంఘం  పెద్దపల్లి  జిల్లా కన్వీనర్ గా ఇనుముల సతీష్..

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లా మున్నూరు కాపు సంఘం మహాసభ జిల్లా కన్వీనర్ గా ఇనుముల సతీష్ మున్నూరు ను నియమిస్తున్నట్లు  తెలంగాణా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు  మణికొండ వెంకటేశ్వర రావు మున్నూరు  తెలిపారు. ఈమేరకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని కాచిగూడ లో గల తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కార్యాలయంలో పలువురు కుల భాందవుల సమక్షంలో ఇనుముల సతీష్ కు నియామకపు లేఖను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు శమణికొండ వెంకటేశ్వర రావు  మాట్లాడుతూ గత 30 ఏండ్లుగా మంథని ప్రాంతంలో మున్నూరు కాపు సంఘం కోసం అనేక కార్య్రమాలను నిర్వహించి, మున్నూరు కాపు యువక మండలిలో చురుకుగా వ్యవహరించి కాపు కుల సమస్యల పై నిరంతరం కృషి చేస్తున్న సేవలను గుర్తించి ఇనుముల సతీష్ మున్నూరును  పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం కన్వీనర్ గా నియమించామని అన్నారు.

పెద్దపల్లి జిల్లాలో మున్నూరు కాపు సంఘాల ఏర్పాటుతో  పాటు,13 మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తూ,వాటిని బలోపేతం చేస్తూ కుల సోదరుల ఐక్యతకు కృషి చేయాలని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మున్నూరు కాపు కార్పొరేషన్ ఫలాలను గ్రామీణ స్థాయిలో ఉన్న మున్నూరు కాపు రైతు సోదరులకు అందే విధంగా శ్రమించాలని వారు కోరారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఇనుములా సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు  మణికొండ వెంకటేశ్వర రావు కు ,ఇతర రాష్ట్ర కార్యవర్గానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ...అదేవిధంగా గత ప్రభుత్వంలో మొట్ట మొదటి సారిగా రాష్ట్ర అసెంబ్లీలో మున్నూరు కాపు కుల సోదరుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన మేరకు ఆతర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఈ అంశాన్ని చేర్చినప్పటి నుండి మొన్నటి క్యాబినెట్ ఆమోదం దాకా తీవ్రంగా కృషి చేసిన రాష్ట్ర ఐ.టి. శాఖా మంత్రివర్యులు, మంథని శాసన సభ్యులు  దుద్ధిల్ల శ్రీధర్ బాబు కు  పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు కుల సోదరుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కి, ఇతర మంత్రివర్గ సభ్యులకు కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వర రావు,  కార్యదర్శి  కొంతం సురేష్ బాబు , మహాసభ మ్యారేజ్ బ్యూరో కన్వీనర్  కొమ్ము శ్రీనివాస్, కొరివి వేణుగోపాల్,  అయిలి శ్రీనివాస్, మంగు ఆనంద్ కుమార్,  కందికట్ల భాస్కర్,  కంచుకట్ల ప్రకాష్, అనాసి కృష్ణారావు,  భాషెట్టి దయానంద్, అనంతుల ప్రహ్లాద్, చలిమెల రమేష్ కుమార్, చలిమెల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.