నిర్మల్ జిల్లాలో 25.10 శాతం పోలింగ్

నిర్మల్ జిల్లాలో 25.10 శాతం పోలింగ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో ఉదయం 11 గంటల వరకు 25.10 శాతం పోలింగ్ జరిగింది. నియోజక వర్గాల వారీగా చూస్తే ఖానాపూర్ నియోజకవర్గంలో 27.40 శాతం, నిర్మల్ లో 22 శాతం, ముథోల్ లో 26.20 శాతం పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీలు ఓటర్ల  సౌకర్యార్థం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయి.