కాంగ్రెస్ పార్టీలో కులవృత్తులకు పెద్దపీట వేస్తాం

కాంగ్రెస్ పార్టీలో కులవృత్తులకు పెద్దపీట వేస్తాం

ముత్తారంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి కులస్తులతో మాజీమంత్రి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ముద్ర ముత్తారం: కుల వృత్తులకు కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి మంత్రి ఎమ్మెల్యే దుర్దల శ్రీధర్ బాబు అన్నారు మండలంలోని ముత్తారం, కేశన పల్లి తదితర గ్రామానికి చెందిన పద్మశాలి సంఘ కులస్తులు శ్రీధర్ బాబు సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముత్తారం మాజీ సర్పంచ్ తాటిపాముల వకుల రాణి శంకర్ తోపాటు మండలం మాజీ అధ్యక్షులు గూట్ల రవీందర్, చిందం సదానందం తో పాటు చేరిన వారికి కండువాలు కప్పి శ్రీధర్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా షేర్వా కు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కులవృత్తులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షులు దొడ్ల బాలాజీ, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ, ముత్తారం మాజీ సర్పంచ్ తాటిపాముల వకుళరాణి శంకర్, పద్మశాలి సంఘం నాయకులు గుట్ల రవీందర్, చిందం సదానందం పరిగిపండ్ల రాయమల్లు, తదితరులు ఉన్నారు.