మంథని బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

మంథని బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక
  • అధ్యక్షులుగా హరిబాబు ప్రధాన కార్యదర్శిగా సయేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అన్ని పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికైన, ఒక లైబ్రరీ సెక్రెటరీ పోస్టుకు ఇద్దరు న్యాయవాదులు తలపడ్డారు. లైబ్రరీ  సెక్రటరీకి పోస్టుకు జరిగిన ఎన్నికల్లో ఆర్ల నాగరాజు విజయం సాధించగా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు, ఉపాధ్యక్షులుగా రఘుత్వం రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా దండపల్లి విజయ్ కుమార్, ట్రెజరర్ గా ఆంజనేయులు, లైబ్రరీ సెక్రెటరీగా ఆర్ల నాగరాజు, స్పోర్ట్స్ సెక్రటరీగా  శ్రీనివాస్ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి కూ. సత్యనారాయణ తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.