కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దంపతులు...

కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దంపతులు...
  • వేద వాయిద్యాలతో  ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు

ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి:- పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలో నూతనంగా నిర్మించిన కట్టమైసమ్మ తల్లి మరియు సుబ్రహ్మణ్యస్వామి (జంట నాగులు) దేవాలయ మూర్తి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కుటుంబ సమేతంగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు  దంపతులకు ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు వేద మంత్రాలతో ఆశీర్వదించి, శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రతిమను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.