ముద్ర కథనానికి స్పందన - ఎట్టకేలకు లారీల జాతరకు చెక్ పెట్టిన అధికారులు

ముద్ర కథనానికి స్పందన -  ఎట్టకేలకు లారీల జాతరకు చెక్ పెట్టిన అధికారులు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని పట్టణం నుంచి ఖమ్మంపల్లి, గోపాలపూర్ వెళ్లే ప్రధాన రహదారి పై బుధవారం ఇసుక లారీలు అధికంగా వచ్చి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని ముద్ర పేపర్ లో లారీల జాతర... లారీలు బాబోయ్ లారీలు... అనే కథనాన్ని ప్రచురించడంతో స్పందించిన అధికారులు గురువారం మంథని-ఖమ్మంపల్లి, గోపాలపూర్ ప్రధాన రహదారి పై వరుస లో అధికారులు లారీలను సెట్ చేశారు.ప్రధాన రహదారిపై ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా  పోలీస్ లు,  టిఎస్ఎండసీ అధికారులు లారీల సమస్యను పరిష్కరించడంతో ముద్ర కు ఆయా గ్రామాల  ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.