పెద్దపల్లి లో బీఆర్ఎస్ కు భారీ షాక్..

పెద్దపల్లి లో బీఆర్ఎస్ కు భారీ షాక్..
  • కాంగ్రెస్ పార్టీలోకి దూళికట్ట సింగిల్ విండో చైర్మన్, సర్పంచులు మాజీ సర్పంచులు 
  • విజయ రమణరావును భారీ మెజారిటీతో గెలిపించాలి
  • మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.  దూళికట్ట సింగిల్ విండో చైర్మన్ తో పాటు సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు.  వారికి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే,  ఎమ్మెల్యే అభ్యర్థి విజయరమణరావు తో కలిసి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపెల్లి ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో విజయరామణరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. 

జూలపల్లి మండలంలోని  దూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణు గోపాల్ రావు, డైరెక్టర్ మాదారపు శ్రీనివాస్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ కాల్వల అంజయ్యతో పాటు వెంకట్రావుపల్లి,గ్రామ మాజీ సర్పంచ్ దుగ్యాల శ్యాం సుందర్ రావు, వార్డు సభ్యులు దుగ్యాల మనోహర్ రావు, బషీనేని రాజేశ్వర్ రావు అలాగె కిచులాటపల్లి మాజీ ఉపసర్పంచ్ కొత్త శ్రీనివాస్, వడ్కాపూర్ బీఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మహాకలి మొండయ్య, మాజీ విద్య కమిటీ చైర్మన్ సీనియర్  నాయకులు చిన్నమనేని విద్యాసాగర్ రావు,  కాచాపూర్ గ్రామ వార్డు సభ్యులు పురెళ్ల అంజయ్య, జూలపల్లి బీజేపీ మండల నాయకులు పడాల నర్సింగం, 
 సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ అన్నేడి రవీందర్ రెడ్డి. 

గొల్లపల్లి (నారాయణరావు పల్లి) గ్రామ మాజీ సర్పంచి నామని రాజిరెడ్డి.. తోగర్రాయి గ్రామ మాజీ సర్పంచి గుండ మురళి, గర్రెపల్లి మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్, సుద్దాల సింగిల్ విండో డైరెక్టర్ అన్నేడి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి మండలంలోని  పెద్దబొంకూర్ మాజీ సర్పంచ్, పెద్దపల్లి మార్కెట్ డైరెక్టర్ మొగుసలా సరోత్తం రెడ్డి, ఓదెల మండలంలోని హరిపురం మాజీ సర్పంచ్ మేరవేణి రామ స్వామి, జీలకుంట మాజీ సర్పంచ్ దండు రమరవి, పార్టీలో చేరిన వీరందరికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని  శ్రీధర్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.