బిజేపి నాయకుల ముందస్తు అరెస్ట్.

బిజేపి నాయకుల ముందస్తు అరెస్ట్.

మెట్‌పల్లి ముద్ర :- రామగుండం లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. పట్టణ బిజేపి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రతి సారి మంత్రులు, ఎమ్మెల్యే లు బిఆర్ఎస్ పార్టీ నాయకుల పర్యటనల సందర్బంగా బీజేపి నాయకులను అరెస్టు చేయడం అప్రాజస్వామికమైన చర్య అని. ఎక్కడో రామగుండంలో జరిగే మంత్రి కేటీఆర్ పర్యటనకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులను అరెస్ట్ చేయించడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేట విజయ్, పట్టణ ఉపాధ్యక్షుడు కొయ్యాల లక్ష్మన్, లోలపు అనిల్, బొడ్ల గౌతమ్ లు ఉన్నారు.