ఏజెన్సీ ప్రాంతాల పనులకు ముందస్తు అటవీ అనుమతులు పొందాలి... 

ఏజెన్సీ ప్రాంతాల పనులకు ముందస్తు అటవీ అనుమతులు పొందాలి... 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్:ఏజెన్సీ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీ శాఖ నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.మహబూబాబాద్ లో సోమవారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి పనుల కొరకు ముందస్తు అనుమతులపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వివిధ శాఖల నుండి చేపట్టే అభివృద్ధి పనుల కు అటవీశాఖ అనుమతులు పొందేందుకుగాను   ఫారం ఏ ద్వారా నివేదికలను తెప్పించుకొని జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందాలన్నారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా గిరివికాస్ పథకానికి 15 బోరు వెల్స్, మత్స్య శాఖ ద్వారా కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాలలో 13 ఫిష్ పాండ్స్, విద్యుత్ శాఖ ద్వారా ఉప్పలపాడు సబ్ స్టేషన్ రోడ్లు భవనాల శాఖ ద్వారా రహదారులు నీటి పారుదల శాఖ ద్వారా నాలుగు మిషన్ కాకతీయ పనులు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారులు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నాలుగు పనులకు సంబంధించి ప్రతిపాదనలను  గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కమిటీ ఆమోదం పొందాలన్నారు.ఈ జిల్లా స్థాయి కమిటీ సమావేశం లో అదనపు కలెక్టర్ డేవిడ్, డిఆర్ డిఏ పిడి సన్యాసయ్య, విద్యుత్ శాఖ అధికారి నరేష్, రోడ్లుభవనాలశాఖ అధికారి తానేశ్వర్, పంచాయతీరాజ్ శాఖ అధికారి సురేష్, నీటిపారుదలశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారి హేమలత, గిరిజన సంక్షేమ అధికారి సత్యవతి, నాగసాగర్, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.