ధాన్యం కొనుగోళ్ళను విజయవంతం గా చేపట్టాలి.. 

ధాన్యం కొనుగోళ్ళను విజయవంతం గా చేపట్టాలి.. 

మంత్రి సత్యవతిరాథోడ్.. 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళను విజయవంతం గా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ లో సోమవారం ఐడిఓసిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్ల  కేంద్రాల నిర్వహణ తీరుపై జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మంత్రి సత్యవతిరాథోడ్ కు వివరిస్తూ... జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళకు 234 కేంద్రాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే తొర్రూరు, పెదవంగర మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకూడదన్నారు. తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ధాన్యం రవాణాలో కొంతమేరకు విజయం సాధించామని ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో రైతులకు న్యాయం జరిగేలా మరింత సహకారం అవసరమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న దగ్గర నుండి రైతుల ఖాతాల్లో డబ్బులు పడే వరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించి, చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్, డేవిడ్, ఆర్ డివో లు కొమరయ్య,రమేష్ జిల్లా అధికారులు ప్రాథమిక సహకార సంఘ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.