అకాల మృత్యువాత పడ్డ దంపతులు.. అనాథ పిల్లల చదువుకు క్లాస్మేట్స్ చేయూత

అకాల మృత్యువాత పడ్డ దంపతులు.. అనాథ పిల్లల చదువుకు క్లాస్మేట్స్ చేయూత

కేసముద్రం, ముద్ర: పదో తరగతి వరకు తమతో కలిసి చదువుకున్న బాల్య స్నేహితురాలి పిల్లల చదువుకు 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో గురువారం జరిగింది. నాగారం గ్రామానికి చెందిన ఇనుగుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో 2001-02 టెన్త్ బ్యాచ్ విద్యార్థి బైరు వనితతో తొర్రూరు మండలం సోమవారం గ్రామానికి చెందిన మేడి సురేష్ తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వనిత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మృత్యువాత పడ్డారు.

ఆరు మాసాల క్రితం వనిత భర్త సురేష్ కూడా అనారోగ్యంతో మరణించాడు. దీనితో అనిత సురేష్ దంపతుల ఇద్దరు పిల్లలు సహస్ర, అశ్విత్ అనాధలుగా మారారు. తల్లిదండ్రులను కోల్పోయిన విషయం తెలుసుకున్న వనిత క్లాస్మేట్స్ పిల్లలు ఇద్దరి చదువుల కోసం గురువారం 25 వేల రూపాయలను అందజేశారు. వనితతో చదువుకున్న క్లాస్మేట్స్ దేవులపల్లి సునీల్, కూటికంటి మధు, బూర రజినీకాంత్, మద్దెల సుధాకర్, పబ్బ ఉమేష్, కముటం హైమ, సొప్పరి సూరయ్య, మంద చంద్రయ్య, కుంచాల సురేష్, ఎన్.రజిత (నాగారం) గంజి శిరీష, బండారు మధు, కనికిచర్ల స్వాతి, బూర రామ్మోహన్ , చింతల చంద్రకళ, సట్ల అంజలి, వేముల పద్మ నరెడ్ల స్వప్న, మామిడాల శారద,దేవులపల్లి పద్మిని, బోనగిరి సాంబయ్య, సట్ల వెంకన్న, పత్తి పాక ప్రవీణ్, కన్న సారంగపాని, కొట్టం శ్రీకాంత్, ఎర్రం ప్రవీణ్, గుగులోతు రాము, గోపందాస్ సురేందర్, పోలోజు రాజు, మల్లెపాక రమేష్, గుగులోత్ వీరన్నలు కలిసి ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం కూడా మరింత సహాయం చేస్తామని, వారి ఉన్నతి కోసం అండగా నిలుస్తామని అభయం ఇచ్చారు.