టార్గెట్.. మహబూబాబాద్ పార్లమెంట్..!!

టార్గెట్.. మహబూబాబాద్ పార్లమెంట్..!!
My Target Mahbubabad Parliament says Revanth reddy

రేపటి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర..

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చుననే ఊహాగానాల నేపద్యంలో పాలకపక్షానికి దీటుగా ప్రతిపక్షాలు కూడా పోరుకు  సమాయత్తం అవుతున్నాయి. అందులో బాగంగానే టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రనను మహబూబాబాద్ పార్లమెంట్ టార్గెట్ గా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు అసెంబ్లీలో ఉన్న మేడారం  సమ్మక్క-సారలమ్మతల్లులకు మొక్కి యాత్ర ప్రారంభించనున్నారు. రెండు రోజులు ములుగులోనే యాత్ర నిర్వహిస్తారు. అనంతరం నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల మీదుగా భద్రాచలం దాకా యాత్రను కొనసాగించనున్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ తోపాటు నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలు భారాస ఖాతాలోనే ఉన్నాయి. ములుగు, భద్రాచలం మాత్రం కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి యాత్ర సమాచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో  ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటికే స్థానిక అంశాలు, ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్నర్ మీటింగ్ లలో ప్రధానంగా ప్రస్థావించాల్సిన సమస్యలు, భారాస నాయకులు, ప్రజాప్రతినిధుల తీరువంటి అంశాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేకబృందాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.  తమ ప్రాంతంలో జరిగే యాత్ర ఏర్పాట్లను చూసుకునే పనిలో ఆయా..నియోజకవర్గాల నుండి  అసెంబ్లీ టిక్కెట్ లు ఆశిస్తున్న ఆశావాహులు ఉన్నారు. రేవంత్ రెడ్డి యాత్ర మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో జోష్ నింపుతుందనే గంపెడంతఆశ..కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తుంది.