అంబేద్కర్ విగ్రహాలకు జీపి కార్మికుల వినతి పత్రాలు

అంబేద్కర్ విగ్రహాలకు జీపి కార్మికుల వినతి పత్రాలు

కేసముద్రం, ముద్ర: గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిరసిస్తూ మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రంలోని కార్మికుల వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు జల్లే జయరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుతో పాటు10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బోళ్ల రాములు,  బూర యాక లక్ష్మి , నవీన్,  శ్రీను, గడ్డం యాదగిరి, నాగయ్య, ప్రసాద్, బూర వెంకటమ్మ, ఎల్లమ్మ , సుగుణ, పార్వతమ్మ, ఇద్దమ్మ తదితరులు పాల్గొన్నారు.