కన్నాలలో గ్రంధాలయాన్ని ప్రారంభించిన ఎంపీపీ కొండ శంకర్ 

కన్నాలలో గ్రంధాలయాన్ని ప్రారంభించిన ఎంపీపీ కొండ శంకర్ 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని మండలం కన్నాల గ్రామంలో పౌర పఠన మందిరం.(గ్రంధాలయం)  జిల్లా గ్రంధాలయం ఆధ్వర్యంలో  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ కొండ శంకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రామ ప్రజలు రోజు గ్రంధాలయనికి వచ్చి  చదువుకోవాలని, పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్ ఉన్నాయని, వాటిని వినియోగించుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంథని ఎంపీడీవో శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ హేమలత, వైస్ చైర్మన్ కోమ్మిడి స్వరూప్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముసుకుల సురేందర్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా గ్రంధాలయం మాజీ డైరెక్టర్ గుడిసె గట్టయ్య యాదవ్. రెడ్డి సంఘం అధ్యక్షులు  సురేందర్ రెడ్డి. పంచాయతీ కార్యదర్శి, నాయకులు పోయిల బాబు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.