కుటుంబ కలహాలతోనే కారు ద్వంసం

కుటుంబ కలహాలతోనే కారు ద్వంసం
  • కాంగ్రెస్ పార్టీ పై నింద వేయడం సిగ్గుచేటు
  • ముత్తారం ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముద్ర ముత్తారం: కుటుంబ కలహాలతోనే ఇంట్లో గొడవ పెట్టుకుని కారు ధ్వంసం చేసుకోని కాంగ్రెస్ పార్టీపై నింద వేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు. మంగళవారం ముత్తారంలోని ప్రెస్ క్లబ్ లో  అయన స్థానిక ముత్తారం సర్పంచ్ తూటీ రజిత రఫీతో కలిసి విలేకరుల  సమావేశంలో  మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో శ్రీధర్ బాబుకు అడవి శ్రీరాంపూర్ లో వచ్చిన ఆదరణ ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ  కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నమన్నారు. అడవి శ్రీరాంపూర్ మాజీ సర్పంచి బర్ల రాధమ్మ భర్త చంద్రమౌళి, ఆమె కుమారులు వేర్వేరు పార్టీలో ఉంటూ ఎన్నికల  సమయములో బీఆర్ఎస్ కు అమ్ముడుపోయి పుట్ట మధుకు ఆదరణ తీసుకురావాలని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వారి కారును వారే పగలగొట్టుకొని కాంగ్రెస్ పార్టీపై నింద మోపడం వారి అవివేకానికి నిదర్శమన్నారు. సర్పంచ్ హయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ శ్రీధర్ బాబుతో కోట్ల రూపాయలు సంపాదించుకొని,  గ్రామం నుంచి పట్టణానికి పారిపోయి ఎన్నికల సమయంలో మళ్లీ సంపాదించుకోవడానికి తమ కారును పగలగొట్టుకొని నాటకీయ పరిణామాన్ని తెరలేపారని విమర్శించారు. ఎవరైనా కారును ధ్వంసం చేస్తే ఫిర్యాదు చేస్తే చట్టం తమ పని చేసుకుంటూ దోషులను శిక్షిస్తుందన్నారు. అడవి శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిందని మతిభ్రమించిన మండల బీఆర్ఎస్ నాయకుల సాయంతో గ్రామంలో కారు ధ్వంసం కుట్రను తెరలేపరని,  కారు ద్వంసం విషయం ప్రజలు గమనిస్తున్నరన్నారు. బీఆర్ఎస్ కుట్రలకు భయపడలేదని శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా ప్రజలు మా వెంట ఉన్నారని గెలుపు ఖాయమని బాలాజీ ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు బియ్యని శివకుమార్, నాయకులు వాజిద్ భాష, వెల్మరెడ్డి సంజీవ్ రెడ్డి, బైరి రాజు, సిగ్గం వంశీ, తుమ్మల సదానందం, వీరగోని అంజి తదితరులు పాల్గొన్నారు.